ఏపీలో మూడు రాజధానులు అంశం పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది… దీనికి కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు విమర్శలు చేస్తున్నారు.. పవన్ కల్యాణ్ చంద్రబాబు మాత్రం దీనిని వ్యతిరేకించారు.. గుంటూరు ప్రజలు అలాగే రాజధాని రైతులు భూములు కోల్పోయిన వారు మాత్రం తమకు న్యాయం ఇదేనా మోసపోయాం అని విమర్శలు చేస్తున్నారు.. అయితే మూడు రాజధానులపై జనసేనలో మాత్రం భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా సీమ అలాగే ఉత్తరాంధ్రా నేతలు జగన్ నిర్ణయం స్వాగతిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న యోచనను కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ నేత కొణిదెల చిరంజీవి స్వాగతించారు. అధికార, పాలనా వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరి పవన్ వైఖరి వేరుగా ఉంది సో రాజకీయంగా ఇద్దరు వేరు వేరు పార్టీల్లో ఉన్నారు. ఇద్దరి ఆలోచన వేరు కాబట్టి ఇది ప్రస్తుతం పెద్ద చర్చకు వస్తోంది.
అయితే చిరంజీవి ఇలా జగన్ కు మద్దతు ఇవ్వడం వెనుక రీజన్ ఉంది అంటున్నారు… బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు.. చిరంజీవి మూడు రాజధానులు మంచిది అన్నారు. ఆయనకు రాష్ట్రంలో ఓటు హక్కు కూడా లేదు. విశాఖలో లాభాపేక్ష కోసమే చిరంజీవి.. జగన్కు వంత పాడుతున్నారు అని ఆయన ఆరోపించారు. అయితే మరికొందరు కూడా ఇదే అంటున్నారు. విశాఖలో స్టూడియో నిర్మాణం కోసం మెగా ఫ్యామిలీ ప్లాన్ వేస్తోంది. అందులో భాగంగా విశాఖ అయితే బాగుంటుంది అని చిరు భావించి ఉండవచ్చు అంటున్నారు.