సినిమా ప్రముఖుల ఇళ్లపై జీఎస్టీ సోదాలు త్రివిక్రమ్ ఎందుకు టార్గెట్

సినిమా ప్రముఖుల ఇళ్లపై జీఎస్టీ సోదాలు త్రివిక్రమ్ ఎందుకు టార్గెట్

0
106

ఈ మధ్య సినిమా పరిశ్రమకు సంబంధించిన నిర్మాతలు దర్శకులు నటుల ఇళ్లపై జీఎస్టీ దాడులు జరుగుతున్నాయి.. అయితే వారు పే చేసే ట్యాక్సులలో చాలా తేడాలు వస్తున్నాయి అని అధికారులు తెలుసుకున్నారట. అందుకే వరుసగా కొన్ని బడా బాబుల ఇళ్లపై టార్గెట్ పెట్టుకుంటున్నారు, టిప్ అందే అవకాశం ఉండటంతో ఏక కాలంలో సోదాలు చేస్తున్నారు అధికారులు.

తప్పుడు ఆదాయాన్ని చూపి జీఎస్టీని తక్కువగా చెల్లించారన్న ఆరోపణలపై జీఎస్టీ అధికారులు టాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామిక వ్యాపారవేత్తలపై దాడులు జరుపుతుండటం నేడు పెద్దల ఇళ్లకు వెళ్లి సోదాలు చేయడం కలకలం రేపుతోంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంట్లోను, త్రివిక్రమ్ శ్రీనివాస్, వక్కంతం వంశీ కార్యాలయాలపైనా, సినీ నిర్మాణ సంస్థ హారికా హాసినీ క్రియేషన్స్, సితారా ఎంటర్ టెయిన్ మెంట్స్ కార్యాలయంలోనూ సోదాలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా వీరితో పాటు స్టీల్ వ్యాపారులు పెద్ద పెద్ద ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు, ఎగవేత చేశారు అని అంటున్నారు.మొత్తం 15 ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తప్పుడు పత్రాలు ఇచ్చిన వారిపై సోదాలు జరుగుతున్నాయట, సాయంత్రానికి పూర్తి డీటెయిల్స్ అయితే రానున్నాయి.