జగన్ మళ్లీ జైలుకేనట…..

జగన్ మళ్లీ జైలుకేనట.....

0
107

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ జైలుకు వెళ్తారా అంటే అవుననే అంటున్నారు మాజీ టీడీపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు… తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియ సామావేశంలో మాట్లాడుతూ…

గతంలో దివంగత రాజశేఖర్ రెడ్డి మాటలు విని కొంతమంది కేసుల్లో ఇరుకున్నారని అన్నారు… ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు సంతకాలు పెడితే ఉన్నతాధికారులు మళ్లీ జైలుపాలు అవుతారని ఆయన హెచ్చరించారు…

16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తులు మళ్లీ జైలుకే వెల్తారని అన్నారు… అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని అన్నారు… వైసీపీ నాయకులు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధానిని మార్చుతున్నారని ఆయన మండిపడ్డారు…