భారత కొత్త ఆర్మీ చీఫ్ఈయనే ఆయన రియల్ స్టోరీ

భారత కొత్త ఆర్మీ చీఫ్ఈయనే ఆయన రియల్ స్టోరీ

0
79

ఆర్మీ చీఫ్గా గత మూడేళ్లుగా సేవలందిస్తున్న జనరల్ బిపిన్ రావత్ ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఓ గొప్ప ఆఫీసర్ గా ఆయన మంచి పేరు సంపాదించారు, నేడు ఆయన పదవీ విరమణ జరుగనుంది.. ఇక ఆయన స్ధానంలో భారత సైన్యానికి కొత్త అధిపతిగా లెఫ్టెనెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే నేడు బాధ్యతలు చేపట్టనున్నారు.

దేశ 28వ ఆర్మీ చీఫ్గా నరవణే బాధ్యతలు చేపడతారు అని ఆర్మీ అధికారులు తెలియచేస్తున్నారు. నరవణే ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్గా ఉన్నారు. ఆయన ఢిల్లీకి రావడానికి ముందు కోల్కతాలో ఈస్ట్రన్ కమాండ్ చీఫ్గా నరవణే పనిచేశారు. కశ్మీర్, ఈశాన్య ప్రాంతాల్లో కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్లు నిర్వహించడంలో విశేషమైన అనుభవం ఆయనకు ఉంది. ఎలాంటి నెగిటీవ్ మార్క్ ఆయనకు లేకపోవడం ఆయన అంటే అధికారులు అందరికి రెస్పెక్ట్ ఉండటంతో ఆయనకు ఈ పదవి వస్తోంది.

గతంలో జమ్మూకశ్మీర్లో రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్కు కమాండెంట్గా, అసోం రైఫిల్స్ ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేశారు. చైనాతో 4000 కిలోమీటర్ల సరిహద్దు గల ప్రాంతాన్ని రక్షించే ఈస్టెర్న్ కమాండ్ అధిపతిగా, శ్రీలంకలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్లోనూ, మయన్మార్లోని భారత రాయబార కార్యాలయంలోనూ బాధ్యతలు నిర్వహించారు. జూన్ 1980లో సిక్కు లైట్ ఇన్ఫ్యాంట్రీ రెజిమెంట్ 7వ బెటాలియన్లో ఆయన తొలి నియామకం జరిగింది.