బంగారం కొనాలనుకునేవారికి బిగ్ షాక్

బంగారం కొనాలనుకునేవారికి బిగ్ షాక్

0
89

రోజు రోజుకు పెరుగుతూ వస్తూ తగ్గుతూ వస్తూ ఊగిసలాడిన బంగారం ఈ ఏడాది భారీ రేటుకి పలికింది 40 వేల మార్క్ దాటింది మళ్లీ అనూహ్యంగా 39 వేలకు చేరింది అయితే కొత్త సంవత్సరంలో బంగారం ప్రియులకు షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. 2020లో పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 45 వేల వరకు చేరుకోవచ్చని బులియన్ వర్గాలు చెబుతున్నాయి.

పసిడిపై దిగుమంతి సుంకం పెంపు, డాలర్ మారకంలో రూపాయి విలువ తగ్గడం అలాగే బంగారం పై విపరీతమైన డిమాండ్ ఉండటం బ్యాంకు వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం ఈ కారాణాలతో వచ్చే ఏడాదిలోనూ బంగారం ధర పెరుగుదల కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఇలా పలు కారణాలతో బంగారం ధర పదిగ్రాములు రూ.45 వేలకు చేర్చవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక, ఈ ఏడాది బంగారం ధర గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ విధానాలు, స్టాక్ మార్కెట్ల వృద్ధి వంటివి ప్రభావం చూపడంతో ఈ ఏడాది ద్వితీయార్థంలో బంగారం ధరలు పైకి పెరిగాయి. ముఖ్యంగా గ్రామాల్లో బంగారం కొనుగోలు శక్తి ఏ ఏడాది పెరిగింది.
బంగారం కొనేదానిలో 70శాతం గ్రామీణ ప్రాంతాల వాటానే ఉంది అని చెబుతున్నారు వ్యాపారులు.