రాయపాటిపై కేసు నమోదు

రాయపాటిపై కేసు నమోదు

0
88

ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే… ఆయనకు సంబంధించిన ట్రాన్స్ ట్రయ్ కంపెనీలపై తనిఖీలు నిర్వహించారు…

అలాగే హైదరాబాద్ గుంటూరు విజయవాడ బెంగుళూరులో ఉన్న నివాసంలో ఉదయం నుంచి ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు… సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రయ్ కంపెనీ 300 కోట్లు మేర బ్యాంకు రుణాలు తీసుకుంది…

అయితే వాటిని తిరిగి చెల్లించకుండా ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం అందుతోంది… ఈ క్రమంలోనే ఆయనపై120 బి రెడ్ విత్ 420 406 468 477 ఏ పీసీఈ యాక్ట్ 13(2) రెడ్ విత్ 13 (1) డి సెక్షన్ల కింద కేసునమోదు చేశారు అధికారులు