చంద్రబాబు సంచలన నిర్ణయం

చంద్రబాబు సంచలన నిర్ణయం

0
86

ఆంధ్రప్రదేశ్ లో వేలాది రైతు కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈ సారి నూతన సంవత్సర వేడుకలకు తెలుగుదేశంపార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు…

నూతన సంవత్సర వేడుకల కోసం చేసే ఖర్చులను పార్టీ నేతలు, కార్యకర్తలు అమరావతి పరిరక్షణ సమితి ఐకాసకు విరాళంగా ఇవ్వాలని కోరారు. ఆరోజు ఆయా గ్రామాల్లో పర్యటించి రైతులు, కూలీలకు అండగా ఉందామని పిలుపునిచ్చారు చంద్రబాబు

అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాల గురించి విద్యార్థులు వీధుల్లోకొచ్చి ఆందోళన చేస్తుంటే, ప్రభుత్వం వారి మీద లాఠీ ఛార్జ్ చేయించడం దారుణం ఆరోపించారు. చదువుకునే విద్యార్థులు రోడ్డెక్కారంటే సమస్య ఏ స్థాయిలో ఉందో తెలియడంలేదా అని ప్రశ్నించారు విద్యార్థుల చదువులు ఆగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు