హైదరాబాద్‌లో రైల్వే ప్రయాణికులకు శుభవార్త

హైదరాబాద్‌లో రైల్వే ప్రయాణికులకు శుభవార్త

0
101

తాజాగా కేంద్ర ప్రభుత్వం రైల్వే టికెట్ ఛార్జీలను పెంచింది ,దీంతో కొన్ని ట్రైన్లకు ప్రయాణ చార్జీలు భారీగా పెరగనున్నాయి. అయితే ఈ సమయంలో హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ ప్రయాణికులకు శుభవార్త చెప్పారు రైల్వే అధికారులు. రైలు టికెట్లు పెంచిన కేంద్రం ఎంఎంటీఎస్ (సబర్బన్), ప్యాసింజర్ సీజన్ టికెట్ల జోలికి వెళ్లలేదు.

దీంతో నగరంలో ఎంఎంటీఎస్‌లలో ప్రయాణించే వేలాది మందికి ఊరట లభించినట్టు అయింది. నగరంలో ఎక్కువమంది ఉపయోగించే ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ తర్వాత ఎంఎంటీఎస్‌దే కీలక స్థానం. చిరు ఉద్యోగులు విద్యార్దులు దీనిపైనే ఎక్కువ ట్రావెల్ చేస్తారు.. అందుకే దీనిపై చార్జీల మోత మోపలేదు కేంద్రం. దీనిపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రైలు చార్జీలను స్వల్పంగా పెంచిన కేంద్రం. ఈ రోజు నుంచి అమలులోకి తీసుకువస్తోంది కొత్త చార్జీలని… ప్యాసింజర్ (ఆర్డినరీ) సెకండ్, స్లీపర్, ఫస్ట్‌క్లాస్ చార్జీలు కిలోమీటరుకు పైసా చొప్పున పెరగ్గా, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సెకండ్ క్లాస్, స్లీపర్, ఫస్ట్‌క్లాస్‌లకు కిలో మీటరుకు 2 పైసల చొప్పున, ఏసీ చైర్ కార్, త్రీటైర్, టూటైర్, ఫస్ట్‌క్లాస్‌లలో కిలోమీటరుకు నాలుగు పైసల చొప్పున చార్జీలు పెరిగాయి.ఎంఎంటీఎస్ చార్జీలు సాధారణంగానే ఉంటాయి అనేది గుర్తు ఉంచుకోండి.