జనవరి 1 శ్రీవారి తొలిదర్శనం ఎవరికి అంటే

జనవరి 1 శ్రీవారి తొలిదర్శనం ఎవరికి అంటే

0
40

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు, సప్తగిరుల శ్రీనివాసుడు ఆనందనిలయుడ్ని దర్శించుకోవాలి అని భక్త కోటి పులకిస్తారు.. వేల మైళ్ల దూరం మొక్కులు తీర్చుకునేందుకు శ్రీనివాసుని ఆనంద నిలయానికి వస్తారు.. అయితే ముఖ్యంగా ధనవంతులు కూడా జనవరి మొదటి తారీఖున స్వామిని దర్శించుకోవాలి అని అనుకుంటారు.. వీఐపీ బ్రేక్ దర్శనాలకే గతంలో ఎక్కువ తి.తి.దే అవకాశం కల్పించేది. దీంతో భక్తులకు తీవ్రనిరాశ వచ్చేది.

అయితే ఈ కొత్త ఏడాది, జనవరి 1వ తేదీన శ్రీవారి మొదటి దర్శనం సామాన్యులకే టీటీడీ కల్పించింది. సాధారణంగా జనవర్‌ 1న ధనుర్మాస పూజల తర్వాత వీఐపీలను దర్శనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత సర్వదర్శనం ప్రారంభిస్తారు. తెల్లవారుజామున ధనుర్మాస పూజల తర్వాత 3 గంటల నుంచి సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించారు.

భక్తుల దర్శనం తర్వాత ఈ ఉదయం 6 గంటలకు వీఐపీ బ్రేక్‌ దర్శనం ప్రారంభించారు. భక్తుల బ్రేక్‌ దర్శనాలకు ప్రోటోకాల్‌, వీఐపీలకు మాత్రమే పరిమితం చేశారు. దీంతో వీఐపీ బ్రేక్‌ త్వరగా పూర్తికానుంది. ఇక తర్వాత అర్దరాత్రి వరకూ సామాన్య భక్తులకు దర్శనం కల్పించనున్నారు.. శ్రీవారి ఆలయానికి భక్తులు లక్షల సంఖ్యలో పోటెత్తుతున్నారు.