మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమని భువనేశ్వరిపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు… ఇటీవలే భువనేశ్వరి అమరావతి పరిరక్షణ సమితికి తన రెండు చేతులకు ఉన్న గాజులను ఇచ్చిన సంగతి తెలిసింది…
దీనిపై రోజా స్పందించారు తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… చివరి రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కే అన్నం పెట్టలేని భువనేశ్వరి ఇప్పుడు తన గాజులను తాకట్టు పెట్టి రాజధాని రైతులకు పరమాన్నం పెడతాను అన్నారట అంటూ రోజా సెటైర్స్ వేశారు…
కాగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ ఏపీలో మూడు రాజధానులు రావచ్చని ప్రకటించారు… దీంతో ఏపీలో రాజధాని రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి…