మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు… తాజాగా అమరావతిలో విపక్షాలు జాతీయ రహదాని దిగ్బందానికి పిలుపునిచ్చాయి…
దీంతో లోకేశ్ చినకాకానికి చేరుకున్నారు.. ఈనేపథ్యంలోనే శాంతిబధ్రతలరిత్య ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు… ఆయనతోపాటు మరికొందరి టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు… అరెస్ట్ చేసిన వారందరిని పోలీస్ వాహనంలో యనమల కుదురు పీఎస్ కు తరలించారు…
లోకేశ్ అరెస్ట్ ను అమరావతిలోని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.. కాగా కొద్దికాలంగా అమరావతిలో ధర్నాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే… అమరావతినుంచి రాజధానిని తరలించవద్దని రాజధాని ప్రాంత వాసులు ధర్నాలు చేస్తున్నారు…