మీ సేవ లో ఉద్యోగాలు చేసే సిబ్బంది తమ ఉద్యోగాల కోసం ధర్నాచౌక్ దగ్గర ఆందోళనలు చేసారు …ఈ సమయంలో మాజీ మంత్రి నారా లోకేష్ వారి గురించి వారికి బాసటగా మాట్లాడారు. ఏపీలో 4 లక్షల మంది వైసీపీ తరపున వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి .. ప్రభుత్వం 10లక్షల మంది ఉద్యోగులను తొలగిస్తోందని లోకేష్ విమర్శలు చేసారు …. ఈ ఉద్యోగాలపై 30వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని వారికి న్యాయం ఎవరు చేస్తారని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం పటేల్ పట్వారీ వ్యవస్థను తీసుకొస్తుందని ఆరోపణలు చేసారాయన….ఈ ఉద్యోగ సమస్యపై ప్రభుత్యం స్పందన లేదని అన్నారు.. ఈ ఉధ్యమం లో జరిగే ఆత్మహత్య లు అన్ని ప్రభుత్య పరిధిలోనివి అన్నారు ఆయన
.మీసేవ ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీ, మండలిలో మాట్లాడతామని నారా లోకేష్చెప్పారు.. అయితే .. .వైసీపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు మీ సేవ పనులు అప్పగించాలని నిర్ణయించారు అని తెలుస్తుంది. ఇక మీ సేవ సర్వీసులు తీసేస్తే ఇక వారికి ఏ ఉద్యోగాలు కల్పిస్తారని విమర్శలు వస్తున్నాయి.