అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పౌర సరఫరా శాఖ మంత్రి కొడాలి నానిపై టీడీపీ మాజీమంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.. గతంలో నాని టీడీపీలో కొనసాగుతున్న సమయంలో ఎమ్మెల్యే టికెట్ కోసం అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర చేతులు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు…
ఈ విషయాన్ని మరిచిపోవద్దని ఉమా హెచ్చరించారు… చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం నాని ముర్ఖత్వం అని అన్నారు… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావాలను నాని బయటపెడుతున్నారని ఆయన మండిపడ్డారు…
జగన్ మోహన్ రెడ్డి దమ్ముంటే రాజధాని గ్రామాలల్లో పాదయాత్ర చేయాలని ఉమా సవాల్ విసిరారు… వైసీపీ పతనం స్టార్ట్ అయిందని అన్నారు… కాగా కొద్దికాలంగా అమరావతి ప్రాంతల్లో రైతులు ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే…