జనసేన పార్టీ తరపున గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మరోసారి పవన్ కు షాక్ ఇచ్చారు… ఆయన తాజాగా వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు… ఒక వైపు అధినేత పవన్ కళ్యాణ్…. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై అలాగే మంత్రులపై ఎమ్మెల్యేలపై ఒంటికాలుపై లేస్తుంటే ఆయన ఎమ్మెల్యే మాత్రం వైసీపీకి జై అంటున్నారు…
అసెంబ్లీ సాక్షిగా ఇంగ్లీష్ మీడియంకు సపోర్ట్ చేసిన రాపాక మరోసారి జగన్ ప్రవేశ పెట్టిన అమ్మఒడిపథకం కార్యక్రమంలో పాల్గొన్నారు… తాజాగా తన నియోజకవర్గంలో అమ్మఒడి కార్యక్రమం ప్రారంభించారు….
ఈ కార్యక్రమానికి హాజరు అయిన రాపాక అర్హులు అయిన వారికి చెక్కులను పంపిణీ చేశారు… అంతేకాదు జనసేన పార్టీ కండువా కప్పుకున్న ఓ మహిళ కూడా జగన్ పొగుడుతూ మరో 30 సంవత్సరాలు జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉంటారని తెలిపింది…