పవన్ ని ఏమైనా అంటే ఊరుకోను చంద్రబాబు

పవన్ ని ఏమైనా అంటే ఊరుకోను చంద్రబాబు

0
79

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏమైనా వైసీపీ విమర్శలు చేస్తే జనసేనాని వెంటనే కౌంటర్ ఇస్తారు… అలాగే జనసేనానిపై ఏమైనా కౌంటర్ వేస్తే, వారికి తిరిగి రివర్స్ కౌంటర్ వేస్తారు చంద్రబాబు, తాజాగా మాజీ ముఖ్యమంత్రి ఏపీ ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు పవన్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్ పోరాటాలు చేసి పైకి వచ్చిన వ్యక్తి అని ప్రశంసించారు. మీరంతా దోపిడీలు చేసి పైకి వచ్చారని వైసీపీ నేతలను ఉద్దేశించి ఆరోపించారు చంద్రబాబు. పవన్ కల్యాణ్ను పవన్ నాయుడు అంటున్నారని, మీ కొడాలి నాని ఏమైనా నానిరెడ్డా? అని ప్రశ్నించారు… అమరావతిని తరలించాలి అనే నిర్ణయం వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు ఆయన.

ఈ విషయంలో అందరూ ప్రశ్నించాలి అని పిలుపునిచ్చారు చంద్రబాబు … ఇలా వదిలేస్తే ఆంధ్రుల భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుందని హెచ్చరించారు. సంపద సృష్టించడం ఎలాగో సీఎం జగన్కు ఏం తెలుసు అని నిలదీశారు. అయితే పవన్ పై చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంతో ఇద్దరూ మంచి మిత్రులు అని వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. అందుకే పవన్ ని ఏమైనా అంటే బాబు రియాక్ట్ అవుతారు అని అంటున్నారు.