జనవరి 9న ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని చిత్తూరులో ప్రారంభించారు. మథ్యాహ్నం అందరి తల్లులకి లబ్దిదారులకి 15 వేల రూపాయలు బ్యాంకు అకౌంట్లో పడ్డాయి, అయితే చదువుతో పాటు మధ్యాహ్నం పిల్లలకు అందించే భోజనాలపై కూడా శ్రద్ద తీసుకున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.. తాజాగా పిల్లల కోసం కొత్త మెనూని ప్రవేశపెట్టారు .. మరి మీరు కూడా సర్కారు ఏమి ఆహరం పెడుతుందో తెలుసుకోండి.
మధ్యాహ్న భోజన పథకం మెనూ పరిశీలిస్తే
సోమవారం: అన్నం, పప్పుచారు, ఎగ్ కర్రీ, స్వీట్
మంగళవారం: పులిహోర, టొమాటో పప్పు, ఉడికించిన గుడ్డు
బుధవారం: వెజిటబుల్ రైస్, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్
గురువారం: కిచిడీ, టొమాటో చట్నీ, ఉడికించిన గుడ్డు
శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, స్వీట్
శనివారం: అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్.
మరి మీ పిల్లకి ఇక ప్రభుత్వ స్కూల్లో ఈ రకమైన భోజనం పెడతారు, అయితే ఏపీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది అంటున్నారు తల్లిదండ్రులు.. తాము కూడా రోజూ స్వీట్ తో భోజనం పెట్టలేమని కాని ప్రభుత్వం ఇలా భోజనం పెట్టడం చాలా మంచి నిర్ణయం అంటున్నారు పిల్లల తల్లిదండ్రులు.