అమరావతి రైతులకు మద్దతు పలికిన ప్రముఖ హీరో, సింగర్

అమరావతి రైతులకు మద్దతు పలికిన ప్రముఖ హీరో, సింగర్

0
92

రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ అక్కడి రైతులు కొద్దికాలంగా ధర్నాలు ర్యాలీలు చేస్తున్న సంగతి తెలిసిందే… ఈ ధర్నాలు రోజు రోజుకు ఉద్రిక్తం అవుతున్నాయి… వీరికి మద్దతుగా ప్రతిపక్ష టీడీపీ అలాగే జనసేన పార్టీలు నిలిచాయి…

కానీ తెలుగు ఇండస్ట్రీకి చెందిన వారు మాత్రం ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు… ఇటీవలే జగన్ నిర్ణయానికే జై కొట్టారు చిరంజీవి…. అయితే తాజాగా రైతులకు మద్దతుగా సిని హీరో నారా రోహిత్ మద్దతు తెలిపారు… ఆయన తర్వాత ప్రముఖ సింగర్ స్మిత కూడా మద్దతు ప్రకటించింది…

రాజధాని తరలింపు బాధాకరమని రైతుల ఆవేదన చూస్తుంటే గుండె ముక్కలవుతోందని అన్నారు.. రైతులపై సానుభూతి చూపించలేని వారిని చూస్తుంటే కూడా బాధవేస్తోందని అన్నారు… రైతులకు న్యాయం జరగాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని తెలిపింది…