మూడు రాజధానుల వ్యతిరేకతకు ఆపార్టీ దూరం జగన్ ఫుల్ హ్యాపీ

మూడు రాజధానుల వ్యతిరేకతకు ఆపార్టీ దూరం జగన్ ఫుల్ హ్యాపీ

0
90

ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల వ్యావహారం హాట్ టాపిక్… రాజధానిని అమరావతిలోనే ఉంచాలని అక్కడి రైతులు ధర్నాలు చేస్తున్నారు… వారికి మద్దతుగా ప్రతిపక్ష టీడీపీ అలాగే జనసేన పార్టీలతో పాటు సీపీఐ పార్టీ కూడా ధర్నాలు చేస్తున్నాయి… రాజధానిని ఇక్కడే ఉంచాలని డిమాండ్ చేస్తున్నాయి….

ఇక బీజేపీలో అయితే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి… కన్నాలక్ష్మీ నారాయణ పురందేశ్వరి, సుజనా వంటి వారు అమరావతికి జై కొడితే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన విష్ణుకుమార్ రాజు వంటి వారు త్రీ క్యాపిటల్ కు జై కొట్టారు… ఇక రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు కూడా హైకోర్టును స్వాగతిస్తునే ఇక్కడ మినీ క్యాపిటల్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు…

అయితే ఈ రాజధాని రగడలో లెఫ్ట్ పార్టీ సీపీఎం మాత్రం దూరంగా ఉంటోంది.. రాష్ట్రంలో ఏ చిన్న సమస్య జరిగినా సీపీఎం సీపీఐ పార్టీలు కలిసి పోరాడుతాయి… కానీ రాజధాని పోరాటంలో సీపీఐ మాత్రమే పోరాడుతోంది.. సీపీఎం దూరంగా ఉంది… కాగా ఇటీవలే సీపీఎం కార్యదర్శి మధు శస్త్రచికిత్స చేయించుకుంటే ఆయన ఇంటికి వెళ్లి జగన్ పరామర్శించిన సంగతి తెలిసిందే…