సిగ్గులేదా… లోకేశ్

సిగ్గులేదా... లోకేశ్

0
100

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ హహన్ రెడ్డి పై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. జగన్ కోర్టుకు హాజరయితే టీడీపీ నాయకులను గృహ నిర్బంధం చెయ్యడం ఎందుకు? తప్పు చేసిన వ్యక్తి రోడ్లపై తిరుగుతుంటే రైతులకు అండగా నిలుస్తూ శాంతియుత పోరాటం చేస్తున్న నాయకులను, జేఏసీ సభ్యులను హౌస్ అరెస్ట్ చేస్తారా? సిగ్గుగా లేదా అని లోకేశ్ ప్రశ్నించారు…

జాతీయ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతారా అని ప్రతీ ఒక్కరు చర్చించుకుంటున్నారని అన్నారు. అక్రమ అరెస్టులతో ఏం సాధిస్తానని ముందు మీ తుగ్లక్ నిర్ణయాలను మార్చుకోండని లేకేశ్ అన్నారు..

అలాగేమూడుముక్కలాటకి రైతులు, రైతు కూలీలు బలైపోతున్నారని ఆరోపించారు. మందడం గ్రామంలో రైతు కూలీ గోపి ఆత్మహత్య ఘటన తనన తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని లోకేశ్ ఆరోపించారు..