ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు…. వైసీపీ తలపులు తీస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేశ్ తప్ప మిగిలిన వారందరూ వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని వ్యాఖ్యానించారు…
తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ కూడా వైసీపీలో చేరుతారని అన్నారు.,.. గతంలో బాలయ్య మీదున్న కేసులు రీఓపేన్ చేస్తే ఆయన కూడా వైసీపీలో చేరుతారని అన్నారు..
బాలయ్య గతంలో తన ఇంట్లో జరిగిన కాల్పుల కేసునుంచి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహాయంతో బయటపడ్డారని నారాయణ స్వామి అన్నారు…. చంద్రబాబు నాయుడుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు చేసింది శూన్యం అని ఎద్దేవా చేశారు…