మన దేశంలో అమ్మాయిలకు రక్షణ కరువు అవుతోంది ….ఒంటరిగా అమ్మాయి వెళ్లాలి అంటేనే నేడు అమ్మాయిలు భయపడిపోతున్నారు…సమాజంలో ఆడపిల్లకి రక్షణ అనేది కరువైపోతుంది…ప్రతి రోజు ఎక్కడో ఒక చోట అమ్మాయిలపై దారుణాలకు దిగుతున్నారు కొందరు మానవ మ్రుగాలు…కొందరు కామాంధులు అమ్మాయిల జీవితాలని నాశనం చేస్తున్నారు…ఆడపిల్ల పై అఘాయిత్యాలు జరగకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా ఎన్ని చట్టాలని తీసుకువచ్చినా వారిలో మార్పు రావడం లేదు.
2012లో నిర్భయ ఘటన జరిగిన తర్వాత ఆమె పేరుమీద చట్టం తీసుకువచ్చారు. అయినా గత ఏడాది దిశ ఘటన జరిగింది.. తాజాగా నేడు మధ్యప్రదేశ్ లో యువతి దారుణంగా లైంగిక దాడికి గురైంది. 12 తరగతి చదువుతున్న యువతి పై ఇద్దరు కామాంధులు బ్లాక్ మెయిల్ చేసి గ్యాంగ్ రేప్ చేశారు, తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి నలుగురు సంచారం లేని ప్రాంతానికి ఆమె వెళ్లింది.. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు వారి దగ్గరకు వచ్చారు.
ఒక్క సారిగా ఇద్దరు వారిపై కర్రలతో దాడి చేశారు. ఆ తరువాత ఆ ఇద్దరి బట్టలు విప్పించి నగ్నంగా ఫోటోలు తీయడంతోపాటు వీడియోను కూడా చిత్రీకరించారు. 5 వేలు డిమాండ్ చేశారు లేకపోతే తల్లిదండ్రులకి అలాగే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామన్నారు, అయితే 5 వేలు తీసుకువస్తాను అని ఆమెని అక్కడ వదిలి ప్రియుడు వెళ్లాడు, తనస్నేహితుడి దగ్గర నుంచి డబ్బులు తీసుకువచ్చాడు, కాని వచ్చేసరికి ఈ దుర్మార్గులు ఆమెని రేప్ చేశారు, దీంతో అతను పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో వారిని కటకటాల్లోకి నెట్టారు.