తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు… తాను పవన్ పై వ్యాఖ్యలు చేసినందుకు పని గట్టుకుని కొందరు జనసేన నాయకులు కుల ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలుచేశారని గుర్తు చేశారు… అయితే అందులో ఒక్క ఉద్యమానికి కూడా పవన్ మద్దతు తెలుపలేదని ఆరోపించారు కాపు రిజర్వేష్లకోసం ముద్రగడ బహిరంగ సభపెడితే తాను కాపులతో కలిసి 25 బస్సుల్లో వెళ్లి మద్దతు ఇచ్చామని అన్నారు…
అంతేకాదు ముద్రగడ కుటుంబంపై లాఠీ చార్జ్ చేస్తే పవన్ ఒక్క మాట అనలేదని ఆరోపించారు.. దీని బట్టే అర్థం అవుతుందని పవన్ చంద్రబాబు నాయుడు మనిషని అన్నారు… కాగా వైసీపీ అలాగే జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే…