ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలో… ఆ పార్టీ నేతలు స్థానికి సంస్థలు ఎన్నికలకు సైసై అంటుంటే ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం నై నై అంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు…
గత ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలు అయింది… 10కి 10 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది… దీంతో జిల్లాలో టీడీపీకి స్ధానికి పోరు పెద్ద పరీక్షగా తయారు అయింది… పార్టీ తరపున కనీసం అభ్యర్ధులు సైతం కరువు అయ్యరని అంటున్నారు విశ్లేషకులు…
టీడీపీ తరపున బలమైన నాయకులు తమ రాజకీయ దృష్ణ ఇతర పార్టీల్లోకి జంప్ చేయడంతో జిల్లాలో టీడీపీ పరిస్ధితి ఆగమ్య గోచరంగా తయారు అయింది… అందుకే జిల్లాలోని చాలా చోట్లు చేతులు కాల్చుకుంటామనే భయంతో ఎన్నికల జోలికి వెళ్లేందుకు తమ్ముళ్లు జంకుతున్నారు.. మరో వైపు గెలుపే లక్ష్యంగా చేసుకుని వైసీపీ నాయకులు అడుగులు వేస్తున్నారు..