బాలయ్య అమరావతి పర్యటన వాయిదా రీజన్ అదేనట

బాలయ్య అమరావతి పర్యటన వాయిదా రీజన్ అదేనట

0
82

తెలుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు, నారాలోకేశ్ ఆ తర్వాత బాలయ్య కీలక పాత్ర పోషిస్తున్నారు… కొద్దికాలంగా అమరావతిలో చంద్రబాబు నాయుడు, లోకేశ్ అలాగే పార్టీ నేతలు కార్యకర్తలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు… కానీ ఇంతవరకు బాలయ్య మాత్రం అమరావతిలో పర్యటించలేదు…

అయితే నిన్న బాలయ్య అమరావతికి వస్తారని అందరు భావించారు.. టీడీపీ అధిష్టానం కూడా పెద్దఎత్తున ప్రచారం చేసింది…కాని చివరినిమిషంలో బాలయ్య పర్యటన వాయిదా పడింది… బాలయ్య అమరావతి పర్యటన వాయిదాపై చాలామంది చర్చించుకుంటున్నారు…

ఏపీలో రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలవల్లే అమరావతి పర్యటన వాయిదా పడిందని కొంతమంది చర్చించుకోగా మరికొంతమంది బాలయ్య ముహూర్తాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అందుకే ఆయన రాలేకపోయారని అంటున్నారు… 18న అయితే మూహూర్త బలంతో పాటు తన తండ్రి వర్దంతి కూడా ఆదేరోజు…. అందుకే ఆయన 18న పర్యటించాలని భావిస్తున్నారని తమ్ముళ్లు అంటున్నారు…