బాలీవుడ్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు

బాలీవుడ్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు

0
97
Maheshbabu

టాలీవుడ్ లో మహేష్ బాబు సినిమా వచ్చింది అంటే ఎంత హైప్ వస్తుందో తెలిసిందే.. పైగా వరుసగా విజయాలు ఆయన ఖాతాలో పడుతున్నాయి. రికార్డులతో చరిత్ర క్రియేట్ చేస్తున్నారు ప్రిన్స్.. మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి బరిలో అదరగొట్టింది.. అనిల్ రావిపూడికి మంచి ఫేమ్ తీసుకువచ్చింది.

ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో మహేశ్ బాబు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. అయితే ఆయన బాలీవుడ్ హాలీవుడ్ అందగాడు అని అంటారు గ్రీక్ రాడ్ అని కూడా చాలా మంది అంటారు, అయితే ఆయనకు బాలీవుడ్ లో నేరుగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి అక్కడ హీరోలు కూడా ఆయనకు చాలా మంది స్నేహితులు ఉన్నారు.

పలువురు మద్దతు ఉంటుంది.. కాని ఆయన మాత్రం ఎప్పుడూ హిందీ చిత్ర పరిశ్రమలోకి వెళ్లలేదు.. తాజాగా ఆయన మరోసారి బాలీవుడ్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు.. తన కెరీర్ లో ఎప్పటికీ హిందీ చిత్రసీమకు వెళ్లబోనని స్పష్టం చేశారు. ఒకసారి కాదు, వందసార్లు అడిగినా బాలీవుడ్ కు వెళ్లననే చెబుతానని, తెలుగు చిత్ర పరిశ్రమే తనకు సర్వస్వం అని వెల్లడించారు. ఇక ఆయన సమాధానంతో మరోసారి బాలీవుడ్ ఎంట్రీ గురించి ఎవరూ అడిగే సాహసం చేయరు, ఒకవేళ తన సినిమాలు హిందీలోకి డబ్ అయి, రెండు చోట్ల ఏకకాలంలో విడుదలైతే తప్ప, ప్రత్యేకంగా హిందీలో సినిమాలు చేయనని తేల్చి చెప్పారు. మహేష్ అభిమానులకు ఇది జోష్ నింపే వార్త అని చెప్పాలి.