బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ..మోదీ ఏమన్నారంటే

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ..మోదీ ఏమన్నారంటే

0
35

దేశంలో కాంగ్రెస్ పార్టీతో సమానంగా జాతీయ పార్టీగా బీజేపీ ఎంతో పెద్ద పార్టీ.. ఎందరో కీలక నేతలు ప్రధానులు అయిన పార్టీ, సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అనే చెప్పాలి, అయితే ఇప్పటికే రెండు సార్లు మోదీకి పట్టం కట్టారు దేశ ప్రజలు, అవినీతి లేని పాలన మోదీ బీజేపీ ద్వారా అందిస్తున్నారు అనే చెప్పాలి.

బీజేపీ కొత్త అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేపీ నడ్డా ఎన్నిక లాంఛనమేనని తెలిసినా, పార్టీ రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించి నామినేషన్ల స్వీకరణ జరిపారు. అయితే ముందుగానే ఆయన ఎన్నిక లాంఛనమే అని అన్నారు.అమిత్ షా తర్వాత ఆయన ఈ బాధ్యత తీసుకున్నారు , అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధినేతలు ఆయన ఎన్నికని స్వాగతించారు.

ఈ మధ్యాహ్నంతో నామినేషన్ల ఉపసంహరణ, పరిశీలన గడువు ముగియడంతో, నడ్డా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు పార్టీ పగ్గాలు అందించారు. ఇప్పటివరకు నడ్డా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. ఇక ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పార్టీకి సేవలు అందించనున్నారు. అంతేకాదు ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. తన పదవీకాలంలో అంతా మంచే జరగాలని ఆశిస్తున్నట్టు మోదీ ట్వీట్ చేశారు.