వికేంద్రీకరణ దిశగా అడుగులు వేయాలని చూస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ… రాష్ట్రంలో ఎక్కడా ప్రాంతీయ అసమానతలు లేకుండాచేయాలనే ఉద్దేశంతో వికేంద్రీకరణ చేయాలని చూస్తున్నారు… అయితే వికేంద్రీకరణను టీడీపీ వ్యతిరేకింస్తుంది…
తాజాగా మరోసారి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజధానిపై స్పందిచారు… వైపీపీ ఎమ్మెల్యేలు కూడా అరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు… తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జేసీ మాట్లాడుతూ… గతంలో ఎన్నడు లేని విధంగా పోలీసుల పాలన సాగుతుందని అన్నారు…
సాధారణ పోలీసులు లాగా ఐపీఎస్ లు కూడా కర్రలతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు… రాజధాని మార్పు దుర్మార్గం అని అన్నారు… రాజధాని మార్పు వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులకు గురి అవుతారని అన్నారు… అర్థిక వికేంద్రీకరణ జరగాలి కానీ పాలన కాదని అన్నారు… వైసీపీ కొంతమంది ఎమ్మెల్యే అమరావతినే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని జేసీ తెలిపారు…