శాసనమండలిలో తెలుగుదేశం అనుకున్నట్లే పై చేయి సాధించింది, తాము అనుకున్న విధంగా రాజధాని బిల్లులని మండలిలో ముందుకు సాగనివ్వలేదు, అంతేకాదు శాసన సభలో నెగ్గినా మండలిలో మాత్రం అడ్డుకున్నారు, అయితే బుధవారం మండలిలో జరిగిన ఘటనలు పరిణామాలకు టీడీపీ బాధపడుతోంది, అందుకే నేడు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది.
శాసనసభకు హాజరుకాకూడదని నిర్ణయించింది. ఇదిలా ఉంటే.. నేడు టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. సభలో తమపై జరిగిన దౌర్జన్యం విషయంలో తదుపరి కార్యాచరణపై టీడీఎల్పీ భేటీలో చర్చించనున్నారు.. ఇప్పటికే కొందరు అధికార పార్టీ నేతలు తెలుగుదేశం ఎమ్మెల్యేలని బెదిరిస్తున్నారని ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి అని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.
చైర్మన్ షరీఫ్ నిర్ణయం ప్రకటించిన వెంటనే ఆయన పై విమర్శలు చేశారు, కొందరుమంత్రులు చేసిన పనికి టీడీపీ నేతలు ఆశ్చర్యపోయారు, ఇలాంటి దారుణాలు మండలిలో జరుగుతున్నాయని ఆయన విమర్శించారు, అంతేకాదు ఆయనపై ఒత్తిడి తీసుకువచ్చినా రాజ్యాంగానికి లోబడి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలియచేశారు టీడీపీ నేతలు.