ఈ దెబ్బతో లోకేశ్ రాజకీయ జీవితం ముగిసినట్టే

ఈ దెబ్బతో లోకేశ్ రాజకీయ జీవితం ముగిసినట్టే

0
73

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచే ప్రణాళికలో భాగంగా అప్పట్లో యనమలని స్పీకర్ గా చంద్రబాబు నాయుడు తెరపైకి తీసుకొచ్చారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు…. బాస్ సిఎం కావడానికి స్పీకర్ స్థానంలో ఉండి ఆయన చరిత్రలో నిల్చేంత సేవ చేశారని ఆరోపించారు. ఇప్పుడు కౌన్సిల్ ఇమేజిని కూడా చంద్రబాబు తన స్వార్థం కోసం మంట కలిపేశారని మండిపడ్డారు.

అహంకారం, దుర్భుద్ధితో చంద్రబాబు వేసిన ఒక్కో తప్పటడుగు పార్టీని, నమ్ముకున్న వాళ్లని అధ:పాతాళానికి నెట్టి వేసిందని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు ఈ వయసులో శక్తికి మించిన విన్యాసాలు చేస్తున్నారని ఆరోపించారు. పప్పు నాయుడు రాజకీయ జీవితం కూడా ముగిసినట్టే అని అన్నారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ వాళ్లు ఇన్నాళ్లు టీడీపీని ఆదరించినందుకు కోలుకోలేనంత దెబ్బకొట్టాలని చంద్రాబాబు నాయుడు చూస్తున్నారని అన్నారు… వెనకబడిన ఈ ప్రాంతాలు ఎప్పటికీ నీ కాలికింద చెప్పులాగే పడి ఉండాలా అని విజయాసాయి రెడ్డి ప్రశ్నించారు మీ ధన దాహానికి వాళ్ల జీవితాలు బలికావాల్సిందేనా అని ప్రశ్నించారు..