ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తాజాగా బిగ్ షాక్ ఇచ్చారు… టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేకు జగన్ కీలక పదవిని కట్టబెట్టారు…
2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా వెస్ట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన గెలిచిన మద్దాలి గిరికి జగన్ కీలక పదవిని కట్టబెట్టారు… గుంటూరు మిర్చి యార్డ్ గౌరవ చైర్మన్ గా నియమించారు… అలాగే అదే నియోజకవర్గంలో వైసీపీ తరపున ఓటమి చెందిన చంద్రగిరి ఏసు రత్నంను మిర్చి యార్డ్ చైర్మన్ గా నియమించారు…
కాగా ఇటీవలే మద్దాలి గిరి ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే… తన నియోజకవర్గ అభివృద్దికి నిధులు కేటాయించాలని కోరారు… దీంతో టీడీపీ అధిష్టానం ఆయనకు చెక్ పెట్టేందుకు నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జ్ ను నియమించింది… మరోవైపు వల్లభనేని వంశీకూడా టీడీపీకి రెబల్ గా మారిన సంగతి తెలిసిందే…