పక్కా ప్లాన్ తోనే చంద్రబాబు వారికి బాధ్యతలు…

పక్కా ప్లాన్ తోనే చంద్రబాబు వారికి బాధ్యతలు...

0
79

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాన్లు వేస్తూన్నారు… అందులో భాగంగానే పార్టీ సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడుకు అలాగే యనమల రామకృష్ణుడుకు చంద్రబాబు నాయుడు కీలక బాధ్యతలను అప్పగించారు…

టీడీపీ నుంచి ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించకుండా చూసేందుకు వీరిద్దరిని చంద్రబాబు రంగంలోకి దింపారు… పార్టీ పరంగా ఎటువంటి ఆలోచన వద్దని అందరికి అండగా ఉంటుందని అంటున్నారు… ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో భవిష్యత్ కార్యచరణపై చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం కానున్నారు…

కాగా శాసనసభలో ఆమోదం పొందిన బిల్లులు శాసనమండలిలో ఆ బిల్లులన్ని అగిపోయాయి… దీంతో శాసనమండలి మనకు అవసరమా అని ఆగ్రహంతో ఉన్నారు ముఖ్యమంత్రి జగన్… ఇక టీడీపీ ఎమ్మెల్సీలు కాపాడుకునేందుకు వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నారు ఇప్పటికే కొందరు డీపీపీ ఎమ్మెల్సీలు శాసనమండలికి రాంరాం అనేశారు.