శాసనమండలిని రద్దు చేయాలా లేదా అనే దాని పై మరి కాసేపట్లో క్లారిటీ రానున్నారు… ఒక వేల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మండలిని రద్దు చేస్తే వైసీపీనే ఎక్కువ ఇబ్బందులు పడుతుంది… త్వరలో శాసనమండలి మొత్తం వైసీపీ సభ్యులతో నిండిపోతుంది… అయితే అది వాస్తమే అయినప్పటికీ మండలి వలన ఉపయోగం లేనప్పుడు పెట్టుకోని ఏం చేయాలని అందుకే మండలిని రద్దు చేయాలని చూస్తోంది…
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో శాసనమండలిని రద్దు శారు ఆతర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మండలిని తీసుకువచ్చారు ఆసమయంలో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు మండలి రావడంవల్ల సమయం వృదా అవుతుందని… తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామని చెప్పారు…
అయితే 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు… కానీ శాసనమండలిని రద్దు చేయలేదు… అప్పుడు మండలిని రద్దు చేసి ఉంటే ఇన్ని తిప్పలు ఉండేవి కాదు… లోకేశ్ ను రాజకీయాల్లోకి తీసుకురావాల్సిన ఆవస్యకత ఉండేది కాదు.. గతంలో ఆశావాహులకు ఎమ్మెల్సీలు ఇచ్చారు… ఇప్పుడు రాజధాని బిల్లు అమోదం కాకుండా అడ్డుకుంటున్నారు… అందుకే మండలి జగన్ కు ఇబ్బందిగా మారింది.. తమకు ఉపయోగం లేనప్పుడు పెట్టుకుని ఏం చేయాలని వైసీపీ ఆరోపిస్తోంది..