ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్

0
89

శాసనమండలి రద్దు తీర్మానంపై ఓటింగ్ ప్రారంభం అవుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు… సభలో స్పీకర్ ప్రకటించగానే శాసనసభ్యులు వల్లభనేని వంశీ అలాగే మద్దాలి గిరిలు సభనుంచి బయటకు వచ్చారు..

కొద్దిరోజుల క్రితం వీరిద్దరు టీడీపీకి రెబల్ గా మారిన సంగతి తెలిసిందే… శాసనమండలి రద్దుపై జరిగే చర్చకు తాము హాజరు కామని టీడీఎల్పీ ప్రకటించింది… కానీ వంశీ అలాగే మద్దాలి గిరిలు హాజరు అయ్యారు… రద్దుపై చర్చ తర్వాత స్పీకర్ ఓటింగ్ ప్రారంభం అవుతుందని ప్రకటించగానే వీరు సభనుంచి బయటకు వచ్చారు…

ఇటీవలే వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే….. తన నియోజకవర్గ అభివృద్ది నిధులపై ఆయన జగన్ తో చర్చించారు… ఆతర్వాత కొద్దిరోజులకు మద్దాలి గిరి కూడా జగన్ ను కలిశారు.. ఇక అప్పటినుంచి వీరు టీడీపీకి రెబల్ గా మారారు…