యంగ్ టైగర్ పై రకుల్ కామెంట్స్

యంగ్ టైగర్ పై రకుల్ కామెంట్స్

0
110

తెలుగు ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. సందీప్ కిషన్, మంచు మనోజ్ లాంటి యువ హీరోలతో కెరియర్ ప్రారంభించినా స్టార్ అవకాశాలను అందుకుని క్రేజీ హీరోయిన్ గా మారింది. తెలుగు, తమిళ భాషల్లో తన అందం అభినయంతో ఆకట్టుకుంటున్న రకుల్ ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేకున్నా తమిళ, హింది భాషల్లో సినిమాలు చేస్తుంది.

ఇక తెలుగులో తను నటించిన అందరి హీరోల గురించి ఒక్కో మాట చెబుతూ ఎన్.టి.ఆర్ గురించి ఏకంగా తెలుగు పరిశ్రమకు ఎన్.టి.ఆర్ ఓ వరం.. మంచి డ్యాన్సర్ అంటూ చెప్పుకొచ్చింది. నవరస నటనా ప్రతిభతో ఎన్.టి.ఆర్ చూపించే అభినయం తోటి నటీనటులను ఆశ్చర్యంలో పడేస్తుంది. అందుకే రకుల్ తారక్ అనగానే అలా అనేసింది.

ఇక సూపర్ స్టార్ మహేష్ కూడా సినిమాపై ఫ్యాషన్ ఉన్న హీరో అన్న రకుల్ బన్ని గురించి కూడా ఇండస్ట్రీని మరో స్థాయికి తీసుకెళ్లగలిగే సత్తా ఉన్న హీరో అని చెప్పడం విశేషం. ఇక రాం చరణ్ గురిచి చిన్న పిల్లాడి మనస్థత్వం కలిగిన వ్యక్తని చెప్పింది రకుల్. మొత్తానికి స్టార్స్ అందరి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో వారి ఫ్యాన్స్ ను అలరిస్తుంది రకుల్.