ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఈయన తెలియని వారు ఉండరు వెయ్యి చిత్రాలలో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా పేరు సంపాదించిన ఓ గొప్ప కమెడియన్.. మన దేశంలో ఉన్న కమెడియన్స్ లో బెస్ట్ కమెడియన్ అనే అంటారు బ్రహ్మనందాన్ని,
అసలు ఆయన ఉంటే నవ్వులు పూయాల్సిందే సినిమాలో, బ్రహ్మానందం కెరీర్ లో 35 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా విశాఖలో ఆయనకు ఘనంగా సన్మానం జరిగింది.. విశాఖ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్మానంలో భాగంగా బ్రహ్మానందానికి వెండి కిరీటం పెట్టి, 35 స్వర్ణ పుష్పాలతో అభిషేకం చేశారు.
అంతేకాదు ఆయనకు బంగారు కంకణం కూడా అక్కడ వారు తొడిగారు, ఆయనని అందరూ పూలమాలలతో సత్కరించారు, బ్రహ్మీ 35 ఏళ్ల సినీ జీవిత విశేషాలతో పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు.ఇక్కడ ఏయూ వీసీ బ్రహ్మనందానికి ఓ మంచి అవకాశం ఇచ్చారు.. ఏయూ విజిటింగ్ ప్రొఫెసర్ గా బ్రహ్మానందానికి ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. ఏయూ థియేటర్ ఆర్ట్స్ విభాగంలో సేవలు అందించాలని కోరుతున్నట్టు చెప్పారు. గతంలో ఆయన అత్తిలిలో కూడా లెక్చరర్ గా పనిచేసిన విషయం తెలిసిందే.