కర్నూలు జిల్లాలో వైసీపీ నేతల రాజకీయాలు ఇప్పుడు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య కోల్డ్వార్ నెలకొంది. తనతో చెప్పకుండా కార్యకర్తలను ఎస్వీ చేర్చుకోవడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.. అయితే దీనిపై జిల్లా నేతలు ఎమ్మెల్యేలు ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందా అని చూస్తున్నారు.
ఒక్క మాటైనా చెప్పుకుండా ఇలా చేయడమేంటి..? అని ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దమ్ముంటే.. పత్తికొండ, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో కూడా స్థానిక ఎమ్మెల్యేలకు చెప్పకుండా మిగతా వారిని పార్టీలో చేర్చుకోవాలని మోహన్రెడ్డికి హఫీజ్ఖాన్ సవాల్ విసిరారు. అయితే పార్టీలో చేరిన ఎస్వీ ఇలాంటి రాజకీయాలు చేయడం ఏమిటి అని అక్కడ రెండు వర్గాలుగా నేతలు చర్చించుకుంటున్నారు.
మా కార్యకర్తల జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు. మా కార్యకర్తలపై దాడులు చేస్తే, మేము చూస్తూ ఉరుకోం. వారికి అండగా ఉంటాం. అని హఫీజ్ అన్నారు, అయితే వీరి వివాదం జిల్లా ఇంచార్జ్ మంత్రి నుంచి సీఎం వరకూ వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో వివాదానికి సీఎం జగన్ ఫుల్ స్టాప్ పెడతారు అని అంటున్నారు.