చంద్రబాబుకు వైసీపీ బంపర్ ఆఫర్

చంద్రబాబుకు వైసీపీ బంపర్ ఆఫర్

0
87

మద్యం ధరలు పెంచినా ఆదాయం ఎందుకు పెరగడం లేదని చంద్రబాబు గోల పెడుతున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేశారు…. ఇది బిజినెస్ మైండ్ కదా అని ప్రశ్నించారు…

ప్రతిదీ లాభనష్టాల కోణంలోనే చూస్తారని ఆరోపించారు. రేట్లు పెంచింది రాబడి కోసం కాదని చంద్రబాబును ప్రశ్నించారు. తాగడం తగ్గించడం కోసమని క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్ జిల్లాకో డీ-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయించారని తెలిపారు మీరూ కూడా నిరభ్యంతరంగా చేరొచ్చని తెలిపారు…

అలాగే మురికివాడల్లో నివసించే పేదల పునరావాస విధానంలో రాష్ట్రాల మధ్య ఏకరూపత లేదని అన్నారు. నిరుపేదలు వారి జీవనోపాధికి దూరం కాకుండా గౌరవప్రదంగా జీవించేలా కేంద్ర ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుంటోందా అని ప్రశ్నించామని తెలిపారు…