విష్ చేయడానికి వెళితే బన్నీ చేసిన పనికి షాకైన జర్నలిస్టులు

విష్ చేయడానికి వెళితే బన్నీ చేసిన పనికి షాకైన జర్నలిస్టులు

0
85

టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రం విజయానందంలో ఉన్నారు.. ఇప్పటికే సక్సెస్ మీట్ కూడా చేశారు.. అయితే ఇటీవల టాలీవుడ్ దర్శకులకి మంచి పార్టీ కూడా ఇచ్చారు అల్లు అర్జున్, ఇక తాజాగా ఆయన మరో చిత్రం సుకుమార్ తో స్టార్ చేశారు.

అల్లు అర్జున్ ను ఫిల్మ్ న్యూస్ కాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కలిశారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయిన సందర్భంగా వారు బన్నీకి శుభాభినందనలు తెలియజేశారు.. ఈ సమయంలో బన్నీ వారిని సర్ ఫ్రైజ్ చేశారు, వారు చేస్తున్నకృషిని బన్నీ అభినందించారు .. అంతేకాదు వారికి 10 లక్షల రూపాయలు తన వంతుగా విరాళం అందించారు.

దీంతో వారు చాలా సంతోషించారు.. తాము వచ్చింది మిమ్మల్ని విష్ చేయడానికి అని చెప్పారు, బన్నీ మాత్రం మీరు చేస్తున్న పనులు నాకు నచ్చాయి.. అందుకే తీసుకోండి నా వంతుగా అని చెప్పారు, అలాగే మీరు లేకపోతే సినిమాల గురించి జనాలకి వార్తలు వెళ్లవు అని తెలియచేశారు ఆయన.