మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి విజయసాయిరెడ్డి రెచ్చిపోయారు… చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద అబద్ధమైనా రాయిస్తారని ఆరోపించారు… చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అన్నింటికి తెగబడి పోయారని మండిపడ్డారు.
ఎల్లో మీడియా వార్తలు ప్రజలు నమ్మడం లేదని రాయిటర్ ఏజెన్సీ పేరుతో కియా వెళ్లిపోతుందని అభూత కల్పన సృష్టించారని ఆరోపించారు…. చంద్రబాబు నాయుడు ప్రజా క్షేత్రంలో తేల్చుకునే దమ్ములేక ఇలాంటి పిరికిపంద పనులకు పాల్పడుతున్నారని ఆరోపించారు….
బంగాళా ఖాతం తీరం నుంచి దూరంగా జరిగిపోతోందని నదులన్నీ వెనక్కి ప్రవహస్తున్నాయని ఆఫ్రికా నుంచి మిడతల దండు ఇటే వస్తోందని ఆంధ్రా వైపు భారీ గ్రహ శకలం దూసుకొస్తున్నట్టు నాసా హెచ్చరించిందంటూ త్వరలో ఇలాంటి వార్తలు వస్తాయని విజయసాయిరెడ్డి ఆరోపించారు చంద్రబాబు, ఐదు కోట్ల మంది ప్రజలతో గేమ్స్ ఆడుతున్నావని హెచ్చరించారు…