ప్రముఖ విద్యాసస్థల అధినేత ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నారాయణ కొత్త వ్యాపారం స్టార్ట్ చేశారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సోషల్ మీడియాలో… 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు ఆయనను ఎమ్మెల్సీ కింద మంత్రిని చేశారు…
అప్పటినుంచి నారాయణ రాజకీయంగా క్రియ శీలికంగా వ్యవహరించారు… చంద్రబాబు నాయుడు లోకేశ్ ల తర్వాత నారాయణ పేరు ఎక్కువగా వినిపించేది… 2019 ఎన్నికల్లో ప్రత్యక్షరాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి నెల్లూరు నుంచి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూశారు…
కానీ ఆయన గెలవలేక పోయారు… ప్రస్తుతం ఆయన తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కున్నారని తెలుస్తోంది.. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడేందుకు తాజా విస్వసనీయ సమాచారం ప్రకారం నారాయణ నెల్లూరు జిల్లాలో రిల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారట… నగరంలో వెంచర్లు వేసి అమ్మకాలు ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి…