టీడీపీ మాజీ మంత్రులకి బిగ్ షాక్ ఇచ్చిన సీఎం జగన్

టీడీపీ మాజీ మంత్రులకి బిగ్ షాక్ ఇచ్చిన సీఎం జగన్

0
78

తెలుగుదేశం పార్టీ నాయకులకి వరుస షాక్ లు ఇస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.. తాజాగా అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సెక్యూరిటీని తీసివేశారు.. ఇది పెద్ద సంచలనం అయింది.. అయితే ఆయనకే కాదు మాజీ మంత్రులు చాలా మందికి సెక్యూరిటీ తొలగించింది ప్రభుత్వం.

ఇప్పటి వరకు ఉన్న 1+1 గన్ మెన్ల భద్రత తొలగించారు. జేసీ సోదరులకు, పరిటాల శ్రీరామ్ కు గన్ మెన్లను తొలగించింది జగన్ సర్కారు అంతేకాదు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రులగా పని చేసిన. దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, నక్క ఆనంద్ బాబు, జెసి దివాకర్ రెడ్డి, పల్లె రఘనాథరెడ్డి, కాల్వ శ్రీనివాసులు లకు భద్రత తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వీరితో పాటు గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలకు కూడా పూర్తిగా భద్రత తొలగించారు, మాజీ ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు నేటినుంచి సెక్యూరిటీ లేదు, తమపై వైసీపీ కక్ష కట్టింది అంటున్నారు టీడీపీ నేతలు.. కాంగ్రెస్ పాలన లో కూడా ఇలా వేధించలేదని వచ్చే స్ధానిక సంస్దల ఎన్నికల్లో ప్రజల దగ్గరకు వెళ్లకుండా ఇలా చేస్తున్నారు అని అంటున్నారు.. ఇటీవల చంద్రబాబు కుటుంబానికి మాజీ మంత్రి నారాలోకేష్ కు కూడా సెక్యూరిటీ తొలగించిన విషయం తెలిసిందే.