భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన హీరో నాగచైతన్య

భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన హీరో నాగచైతన్య

0
96

అక్కినేని నాగ చైతన్య సినిమాల జోరు కాస్త పెరిగింది అనే చెప్పాలి.. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు వస్తున్నాయి…మజిలీ.. వెంకీమామతో వరుస సక్సెస్ లు అందుకుని రేసులో నిలబడ్డాడు. ఇక మల్టీస్టారర్ చిత్రాలకు ఆయన సై అంటున్నారు, అంతేకాదు దాదాపు నలుగురు దర్శకులు ఆయనతో సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారట, అయితే ప్రస్తుతం శేఖర్ కమ్ములతో లవ్ స్టోరీ కథాంశంతో ఓ చిత్రం చేస్తున్నారు.

చైతూ తన 20వ చిత్రాన్ని గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. గీతగోవిందం తర్వాత పరశురాం తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాకి చైతూ రెమ్యునరేషన్ కూడా భారీగా ఉందట, రెండు సూపర్ హిట్ల తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో ఆయన దాదాపు 8 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట.

మజిలీ ముందు 5 -6 కోట్ల మధ్యలో పారితోషికం అదుకునేవాడు. కానీ వరుస సక్సెస్ ల నేపథ్యంలో అదనంగా 2 కోట్లు పెంచాడట. దర్శకుడు పరుశురాం రెమ్యునరేషన్ 10 కోట్లు అయ్యింది అని ప్రచారంలో ఉంది. .. కొందరు హీరోలు 20 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు చైతూకి కూడా 8 కోట్లు తక్కువే అంటున్నారు ఆయన ఫ్యాన్స్ .