కరోనా ఎఫెక్ట్ వారం పాటు చికెన్ మటన్ బంద్ కీలక నిర్ణయం

కరోనా ఎఫెక్ట్ వారం పాటు చికెన్ మటన్ బంద్ కీలక నిర్ణయం

0
37

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలని వణికిస్తోంది.. అంతేకాదు ఈ వైరస్ వల్ల చాలా మంది చికెన్ మటన్ తినడానికి భయపడిపోతున్నారు.. అయితే కేంద్రం కూడా ఇటీవల తెలియచేసింది.. ముఖ్యంగా మటన్ చికెన్ వల్ల ఈ కరోనా వైరస్ రాదు అని.. కేవలం పాము గబ్బిలాల మాంసం వల్ల ఈ వైరస్ వస్తుంది అని చెబుతున్నారు.

ఈ సమయంలో చాలా మంది చికెన్ మటన్ తినడం లేదు , అయితే ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో కోళ్లు కూడా భారీగా చనిపోతున్నాయి, దీనికి కారణం కరోనా లాంటి మరో వైరస్ ఈ కోళ్లని చంపుతోంది అని వార్తలు వినిపించాయి.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతంలో అక్కడ ఎమ్మెల్యే కీలక నిర్ణయం తీసుకున్నారు.

తణుకు నియోజకవర్గంలో అంతుచిక్కని వైరస్ సోకి కోళ్లు చనిపోతుండటంతో ఈ పుకార్లు వచ్చాయి. భారీ సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతుండడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే తణుకుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చికెన్ తోపాటు మటన్ అమ్మకాలపై వారం రోజుల పాటు నిషేధం విధించారు.

ఇదిలావుండగా, తణుకులో పరిస్థితిని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమీక్షించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా రేపటి నుంచి వారం రోజుల పాటు మటన్, చికెన్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు ఎక్కడా మటన్ చికెన్ అమ్మకాలు చేయవద్దు అని చెప్పారు. రెస్టారెంట్లలో కూడా నాన్ వెజ్ వంటలు అమ్మవద్దు అన్నారు, అలాగే కోళ్లు చనిపోతే వాటిని కాలువల దగ్గర పడేయకండి అని చెప్పారు.