అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు భారత్ రాక గురించి ప్రపంచం అంతా చూస్తోంది… ఎలాంటి ఏర్పాట్లు ఇక్కడ సర్కారు చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఈ నెలాఖరులో ఇండియాకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫిదా అయ్యేలా ప్రధాని మోడీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ట్రంప్ ని గుజరాత్ లోని అహ్మదాబాద్ కు తీసుకెళ్లనున్నారు. గత ఏడాది అమెరికాలో నిర్వహించిన హోఢీ – మోడీ తరహా కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాలని భావిస్తున్నారు, అయితే ఇక్కడకు జనం కూడా భారీగా రానున్నారట ఇక్కడ కార్యక్రమం పేరు కెమ్ ఛో ట్రంప్ ….ట్రంప్.. మీరెలా ఉన్నారు అనే పేరుతో కార్యక్రమం చేయనుంది మోదీ సర్కార్.
పది కిలోమీటర్ల పొడవునా భారీ రోడ్డు షో నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లను చేస్తోంది. అహ్మదాబాద్ లో కొత్తగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం ఇరువురు నేతలు ప్రారంభించనున్నారు. దీనికోసం మొత్తం .700 కోట్లు ఖర్చు చేశారు.1.10 లక్షల మంది ఇక్కడ కార్యక్రమం చూడవచ్చు, ప్రపంచంలో ఇదే అతి పెద్దది. అంత మంది జనం అక్కడకు రానున్నారు. దీంతో నిజంగా ట్రంప్ సర్ ఫ్రైజ్ అవుతారు.