పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమా లాయర్ సాబ్.. అయితే ఈ సినిమాకి ఇంకా టైటిల్ ని ఫైనల్ చేయలేదు అనేది తెలిసిందే… చిత్ర యూనిట్ దీనిపై త్వరలో ప్రకటన చేయనుంది.. ఈ రీమేక్ లో పవన్ ఎలా కనిపిస్తారు అనే దానిపై అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. ఇక ఈ చిత్రం కోసం సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి ఓ పాటను రాసినట్లు తెలుస్తోంది.
ఆయన పాట ఎలా ఉంటుందో తెలిసిందే, రాసుకోరా సాంబ.. ఈ పాట మామూలుగా ట్రెండ్ అవ్వదు అంటూ ఆయన ఓ ట్వీట్ చేసి, పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించారు. ఇక రాసుకోరా సాంబ అనే డైలాగ్ పవన్ అభిమానులకి ఎంతలా ఎక్కిందో తెలిసిందే అది పెద్ద ట్రెండ్ సెట్ చేసింది.
తాజాగా ఇలాగే ఓ సాంగ్ రాస్తున్నారట ఆయన , ఈ చిత్రానికి థమన్ బాణీలు అందిస్తున్నారు. పవన్ కల్యాణ్ 26వ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఓ పాటను పాడారని, అది అందరికీ కచ్చితంగా నచ్చుతుందని, ఇందుకోసం మా హార్ట్ అండ్ సోల్ పెట్టామని ట్వీట్ లో చెప్పారు థమన్ . దీనిపైనే స్పందించిన రామ జోగయ్య శాస్త్రి ఈ పాట మామూలుగా ట్రెండ్ అవ్వదు అంటూ స్పందించారు. మరి మేలో సినిమా రానుంది ఏప్రిల్ లో పాట ట్రెండ్ అవ్వనుంది అంటున్నారు అభిమానులు.