కరోనా సోకిన వారిన సముద్రం మధ్యలో షిప్ లో ఉంచి ఏం చేస్తున్నారంటే

కరోనా సోకిన వారిన సముద్రం మధ్యలో షిప్ లో ఉంచి ఏం చేస్తున్నారంటే

0
35

చైనాలో కరోనా వైరస్ దాడి పెరుగుతూనే ఉంది… మరో 5000 మందికి కరోనా సోకింది అని తేల్చింది చైనా.. రోజు రోజుకి చైనాలో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి అని అంటున్నారు.. మొత్తంగా బాధితుల సంఖ్య 63,851 కు చేరినట్టు ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 1,381కి పెరిగినట్టు తెలిపింది.

చైనా నుంచి ఈ వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది, అన్నీ దేశాల్లో కంటే చైనాలోనే బాధితులు ఎక్కువ మంది ఉన్నారు, జపాన్ లో 44 మందికి వైరస్ సోకింది.. అక్కడ 218 మంది అనుమానిత బాధితులు ఉన్నారు..
కొద్దిరోజులుగా జపాన్ సముద్ర తీరంలో ఆపేసిన క్రూయిజ్ షిప్ లో ఉన్న ప్రయాణికుల్లో 200 మందికి కరోనా వైరస్ వ్యాపించినట్టుగా గుర్తించారు.

వారందరికీ షిప్ లోనే ట్రీట్ మెంట్ చేస్తున్నారు. భూభాగంలోకి అనుమతించడం లేదు. దీంతో వారికి చికిత్స ఎలా అందుతుందా అని భయం కుటుంబ సభ్యుల్లో ఉంది.