బ్రేకింగ్ టీడీపీ ఎంపీ రాజీనామా…

బ్రేకింగ్ టీడీపీ ఎంపీ రాజీనామా...

0
76

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేసినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు… అందుకు టీడీపీ మద్దతు ఇవ్వకపోతే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సంచనల వ్యాఖ్యలు చేశారు నాని…

తాజాగా ఆయన కడప జిల్లాలో పర్యటించారు… ఈ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.. గతంలో ఎన్ ఆర్సీ, సీఏఏ లపై అవాగాహలేక మద్దతు ఇచ్చామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారని అవగాహన లేని వారికి పదవులు ఎందుకని ప్రశ్నించారు నాని…

కాగా ఇటీవలే కడప జిల్లాలో పర్యటించిన అంజాద్ బాషకు సీఏఏ సెగలు తగిలాయి… ఇక దీనిపై స్పందించిన అంజాద్ బాషా తాను ముస్లింలకు అండగా ఉంటానని తెలిపారు.. తనకు పదవులు ముఖ్యం కాదని అవసరమైతే డిప్యూటీ సీఎంపదవికి రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు…

సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ప్రతిపాదన పెట్టేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు… ఎన్ఆర్సీ సీఏఏ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు..