జగన్ కు సబ్బం హరి మరో ఛాలెంజ్..

జగన్ కు సబ్బం హరి మరో ఛాలెంజ్..

0
77

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ నేత మాజీ ఎంపీ సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేశారు… వైసీపీ తెరమీదకు తెచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనను విశాఖపట్నం ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు…

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…. విశాఖ ప్రజలు వైసీపీ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని సబ్బం హరి అన్నారు.. స్థానికి సంస్థల ఎన్నికలను వైసీపీ పెట్టి చూడాలని అన్నారు… విశాఖ పట్నం కార్పొరేషన్ లో వైసీపీ గెలిస్తే తాను ఇక రాజకీయ చర్చల్లో పాల్గొనబోనని సవాల్ విసిరారు…

విశాఖ ప్రజలు సైలెంట్ సపోర్ట్ అమరావతి రాజధానివైపు ఉందని అన్నారు… కాగా గత ఎన్నికల్లో సబ్బం హరి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన సంగతి తెలిసిందే అంతకు ముందు వైసీపీకి సపోర్ట్ గా ఉండేవారు సబ్బం హరి…