టీడీపీలో మొదలైన రేస్ చంద్రబాబు దృష్టిలో ఎవరున్నారు…

టీడీపీలో మొదలైన రేస్ చంద్రబాబు దృష్టిలో ఎవరున్నారు...

0
87

తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటినుంచి 2014 ఎన్నికల వరకు కృష్ణా జిల్లాలో టీడీపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంది.. టీడీపీ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఈ జిల్లా మాత్రం పార్టీకి అండగా నిలిచింది… కానీ 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సునామితో టీడీపీ కంచుకోట కొట్టుకుపోయింది…

రాష్ట్ర స్థాయి టీడీపీ నాయకులు సైతం ఓటమి చెందటంతో ప్రస్తుతం టీడీపీ పరిస్ధితి జిల్లాలో ఘోరంగా తయారు అయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు… ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడుగా బుద్దా వెంకన్న ఉన్నారు… ఆయన పార్టీనాయకులను ఎవ్వరిని కలుపుకుని వెళ్లకున్నారట… దీంతో ఆయన ఫెర్ ఫార్మెన్స్ పై పార్టీలో లుకలుకలు వినిపిస్తున్నాయి…

అందుకే బుద్దాను రీప్లేస్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి… మాజీ మంత్రి దేవినేని ఉమా ఎంపీ కేసినేని నానిలు సైతం బుద్దాని వ్యతిరేకిస్తున్నారట… ఉమాకు, నానికి చాలాకాలంగా గ్యాప్ ఉన్నప్పటికీ బుద్దా వెంకన్న విషయంలో వీరిద్దరు ఒక్కటయ్యారని వార్తలు వస్తున్నాయి… ఈ క్రమంలో ముగ్గురు కీలక నాయకులు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారని టాక్ మరి ఈ ముగ్గురిలో ఎవరికి ఆ అదృష్టం వరిస్తుందో చూడాలి…