అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరింపులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి.. తాజాగా నెల్లూరు జిల్లా ప్రభుత్వ అధికారిపై వైసీపీ ఎమ్మెల్యే ఒకరు బెదిరింపులకు దిగారట… కార్యకర్తలకు గౌరవం ఇవ్వకుంటే సంగతి చూస్తానని హెచ్చరించారు…
పార్టీ కార్యకర్తలకు గౌరవం ఇవ్వలేదని మరోసారి తన దృష్టికి వస్తే తనలో ఉన్న రెండో మనిషిని చూస్తారంటూ హెచ్చరించారు… అధికారులు ఇష్టంలేకపోతే మండలం నుంచి వెళ్లిపోవచ్చని ఆరోపించారు… వైసీపీ ప్రభుత్వంలో అధికారులు తమ నాయకులు కార్యకర్తలకు గౌరవం ఇవ్వనప్పుడు తన నియోజకవర్గంలో ఎందుకుండాలని ఆయన అన్నారు..
ఇదే చివరి హెచ్చరికని ఇంకెవరైనా తనకు ఫోన్ చేసి ఫలానా అధికారి మమ్మల్ని అవమానించారని చెబితే ఆ అధికారి ఎక్కడుంటారో తనకే తెలియదని వైసీపీ ఎమ్మెల్యే హెచ్చరించారు…